India v China: వచ్చే నాలుగు నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్‌.. కారణం ఇదే..!

|

Dec 22, 2022 | 11:55 AM

రానున్న నాలుగు నెలల్లో దేశ జనాభా చైనాను దాటిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే 2023 ఏప్రిల్ నెల నాటికి జనాభా సంఖ్యలో చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనా..

India v China: వచ్చే నాలుగు నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్‌.. కారణం ఇదే..!
India To Surpass China Population
Follow us on

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా (140 కోట్లు). భూమిపై ఉన్న మొత్తం జనాభాలో మూడో వంతు జనాభా చైనాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. ఐతే రానున్న నాలుగు నెలల్లో దేశ జనాభా చైనాను దాటిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే 2023 ఏప్రిల్ నెల నాటికి జనాభా సంఖ్యలో చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. ఇటీవల కాలంలో చైనాలో జననాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాదిలో కేవలం కోటీ అరవై లక్షల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఆ దేశ మృతుల సంఖ్యతో పోల్చితే పెద్ద సంఖ్యేమీకాదు. ఇటు భారత్‌లోనూ అదే పరిస్థితి. 1950లో భారత సంతానోత్పత్తి రేటు సగటున 5.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెండుకు తగ్గింది. ఇక 1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతం ఉంది. అంటే జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమిస్తే ఏం జరుగుతుంది?

1975 ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది పేద ప్రజలకు బలవంతంగా స్టెరిలైజేషన్ చేశారు. ఈ చర్య ప్రజల్లో కుటుంబ నియంత్రణపై వ్యతిరేకతకు దారి తీసింది. కొరియా, మలేసియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి తూర్పు ఆసియా దేశాలు, భారత్ కంటే ఆలస్యంగా జనాభా నియంత్రణ చేపట్టినప్పటికీ భారత్ కంటే ముందుగా సంతానోత్పత్తి స్థాయి తగ్గించడంతో పాటు, మాతాశిశు మరణాల రేటు తగ్గుదల, ఆదాయాల పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించాయి.

ఐతే కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. తాజాగా మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో జననాలు మునుపటి కంటే తగ్గటానికి దోహదపడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో జననాల రేటు వేగంగా తగ్గింది. అలాగే ప్రపంచంలో 25 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ అయిదుగురిలో ఒకరు భారతీయు కావడం విశేషం. మన దేశ మొత్తం జనాభాలో 47 శాతం జనాభా 25 ఏళ్లలోపు వారే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

1947లో భారతదేశ ప్రజల సగటు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండింది. ఆ సమయంలో 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు భారత దేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలకు పైగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 10 శాతంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.