South West Monsoon: 2021లో వర్షపాతం ఎలా ఉండబోతోంది.? కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. వివరాలు ఇవిగో.!

ఈ ఏడాది దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలతో...

South West Monsoon: 2021లో వర్షపాతం ఎలా ఉండబోతోంది.? కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. వివరాలు ఇవిగో.!
Monsoon

Updated on: Apr 16, 2021 | 2:20 PM

ఈ ఏడాది దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర భారత దేశంలోని పలు చోట్ల మినహా మిగిలిన ప్రదేశాల్లో మంచి వర్షపాతం నమోదవుతుంది.. అధిక వ్యవసాయ వృద్దిని చూసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు దీర్ఘకాలిక సగటు (LPA) కంటే 103 శాతం అధికంగా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు, మొదట కేరళను తాకి.. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో దక్షిణాది ప్రాంతాల్లో.. సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా తిరోగమనం చేస్తాయి.

ఈ విషయంపై భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ మాట్లాడుతూ.. “సాధారణ వర్షపాతం అయిన లాంగ్ పీరియడ్ యావరేజ్(ఎల్‌పీఏ)లో రుతుపవనాలు 98 శాతం ఉంటాయి. ఇది నిజంగానే శుభపరిణామం. భారతదేశంలో మంచి వ్యవసాయ ఉత్పత్తి జరగడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది” అని అన్నారు.

రుతుపవనాల రిపోర్ట్ ఇలా ఉంది..

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..