కోవిడ్ కేసుల తగ్గుదలలో నాలుగో స్థానంలో భారత్..మరింత తగ్గాలంటున్న ప్రభుత్వం

| Edited By: Anil kumar poka

Jul 18, 2021 | 11:31 AM

రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదలలో 7 రోజుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో ఈ దేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నట్టు ఓ అంతర్జాతీయ స్టడీ పేర్కొంది. ముఖ్యంగా..

కోవిడ్ కేసుల తగ్గుదలలో నాలుగో  స్థానంలో భారత్..మరింత తగ్గాలంటున్న ప్రభుత్వం
Corona Third Wave
Follow us on

రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదలలో 7 రోజుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో ఈ దేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నట్టు ఓ అంతర్జాతీయ స్టడీ పేర్కొంది. ముఖ్యంగా గత వారం రోజులను ఇందులో లెక్క కట్టారు. ఈ ఏడు రోజుల కాలంలో ఇండియాలో 2.69 లక్షల కేసులు నమోదయ్యాయని, ఇది అంతకు ముందు వారంతో పోలిస్తే సుమారు 8 శాతం తక్కువని వెల్లడైంది. బ్రెజిల్ లో 2.87 లక్షలు, బ్రిటన్ లో 2.75 లక్షల కేసులు నమోదు కాగా ఇక ఇండోనేసియా బ్రెజిల్ ని తలదన్ని అత్యధికంగా 3.24 లక్షల కేసులతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది అంతకు ముందు వారంతో పోలిస్తే 43 శాతం ఎక్కువ.. ఇండియా విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 38,079 కి కేసులు నమోదయ్యాయి. 5 వందలమందికి పైగా కోవిడ్ రోగులు మరణించారు. యాక్టివిటీ కేసులు మొత్తం మీద 4,24025 నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 97.31 శాతం ఉండగా పాజిటివిటీ రేటు 2.10 శాతం ఉంది.

అయితే ఈ కేసులు మరింత తగ్గాలని ప్రభుత్వం కోరుతోంది. దేశంలోని ఆనేక ప్రాంతాల్లో..ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరు మరింత పెరగాలని సూచించింది. ఇప్పటికే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని పదేపదే హెచ్చరిస్తోంది. హిమాచల్ వంటి రాష్ట్రాల్లో టూరిస్టుల ఎంట్రీ మీద పరోక్ష ఆంక్షలు విధించారు. మనాలి లాంటి ఎతైన ప్రదేశాల్లో పరిమితంగా మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు. వచ్చే ఆగస్టు రెండు లేదా మూడో వారానికి థర్డ్ వేవ్ దేశాన్ని తాకవచ్చునని ఐసీఎంఆర్ నిపుణుడు డా.సమరిన్ పాండా చెబుతుండగా కొన్ని చోట్ల అప్పుడే ఇది ఎంటరయిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

 బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

 Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌…వైరల్ అవుతున్న వీడియో..:Sania Mirza Dance Video.

పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.