ఈ కుర్రాడు అమరవీరుడు.. ఎవరీ సాహసికుడు ?

| Edited By: Srinu

Nov 14, 2019 | 7:17 PM

అమరవీరుడైన ఓ బాలుడి గురించి.. బాలల దినోత్సవం సందర్భంగా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ గురువారం అతని ఫోటోను పోస్ట్ చేస్తూ అందరి హృదయాల్లోనూ భావోద్వేగం నింపాడు. 12 ఏళ్ళ బాజీ రౌత్ అనే ఈ అబ్బాయి దేశంలోని అమరవీరుల్లోనే అతి పిన్న వయస్కుడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. బ్రిటిష్ సైనికులను ఎదిరించి నిలచిన బాజీ రౌత్ ని… కనీసం ముక్కుపచ్ఛలారని బాలుడని కూడా చూడకుండా వాళ్ళు కాల్చి చంపారు. 1938 నాటి ఘటన ఇది.. నాడు ఒడిశాలో బ్రహ్మణి […]

ఈ కుర్రాడు అమరవీరుడు.. ఎవరీ సాహసికుడు ?
Follow us on

అమరవీరుడైన ఓ బాలుడి గురించి.. బాలల దినోత్సవం సందర్భంగా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ గురువారం అతని ఫోటోను పోస్ట్ చేస్తూ అందరి హృదయాల్లోనూ భావోద్వేగం నింపాడు. 12 ఏళ్ళ బాజీ రౌత్ అనే ఈ అబ్బాయి దేశంలోని అమరవీరుల్లోనే అతి పిన్న వయస్కుడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. బ్రిటిష్ సైనికులను ఎదిరించి నిలచిన బాజీ రౌత్ ని… కనీసం ముక్కుపచ్ఛలారని బాలుడని కూడా చూడకుండా వాళ్ళు కాల్చి చంపారు. 1938 నాటి ఘటన ఇది.. నాడు ఒడిశాలో బ్రహ్మణి నదిని దాటేందుకు ఓ నాటు పడవలో బయల్దేరబోయిన ఆ సైనికులను బాజీ ఎదిరించి నిలిచాడు.

తమను ఆ పడవలో నది దాటించవలసిందిగా కోరినా బాజీ తిరస్కరించాడు. అప్పటికే అమాయకుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీస్తున్న వీరి గురించి విన్న ఆ బాలుడు.. వారి కోర్కెకు ససేమిరా అన్నాడట.. దాంతో ఆగ్రహం పట్టలేక బ్రిటిష్ సైనికుల్లో ఒకడు తన తుపాకీ తీసి అతని నుదుటిపై కాల్పులు జరపడంతో బాజీ నేలకొరిగాడు. అతని తల పగిలి పుర్రె బయటకు రాగా మరొకడు తుపాకీ బాయ్ నెట్ ని అందులోకి జొప్పించి కాల్పులు జరిపాడట..
ఒడిశా.. ధెన్ కెనాల్ జిల్లాలోని నీలకంఠాపురం అనే కుగ్రామంలో 1926 అక్టోబర్ 5 న పేద కుటుంబంలో పుట్టిన బాజీ కథ అలా విషాదాంతమైంది. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోగా..బాజీ తల్లి పనిమనిషిగా చేసేదని ఒడిశా ప్రభుత్వ వెబ్ సైట్ సైతం పేర్కొంది. కాగా- బాలల దినోత్సవం రోజున ఈ చిన్నారి అమరవీరుడికి నివాళులర్పిస్తూ ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో ఇసుకపై అతని చిత్రాన్ని కళాఖండంగా రూపొందించాడు.