India Corona: గుడ్‌న్యూస్.. తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో..

|

Jun 16, 2021 | 9:36 AM

Covid-19 India: దేశంలో కరోనాసెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు భారీగా నమోదైన

India Corona: గుడ్‌న్యూస్.. తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో..
India Corona Updates
Follow us on

Covid-19 India: దేశంలో కరోనాసెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు భారీగా నమోదైన కేసులు కాస్తా.. 60 వేలకు తగ్గాయి. తాజాగా గత 24 గంటల్లో.. మంగళవారం.. 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 2,542 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105 కి చేరగా.. మరణాల సంఖ్య 3,79,573 కి పెరగింది. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 1,07,628 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,83,88,100 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకూ.. 26,19,72,014 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,00,458 మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అయితే.. వారం క్రితం నమోదైన కేసుల కంటే.. ప్రస్తుతం భారీగా తగ్గిందని కేంద్రం వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం తగ్గిందని.. ప్రస్తుతం 4.17శాతంగా ఉందని తెలిపింది. రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Modi Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ.. సమావేశంలో వీటిపైన స్పెషల్ ఫోకస్..

Taj Mahal : టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచే తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్