India Coronavirus Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 6 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 5,921 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఇది గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు కావడం విశేషం. ఈ మహమ్మారి కారణంగా నిన్న 289 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 63,878 (0.15%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,57,477 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,878 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో దేశం మొత్తం 11,651 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,78,721 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.65 శాతానికిపైగా ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,78,55,66,940 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న 21 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరితో కలిపి 178,0263,222 డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
కాగా.. మార్చి 4 వరకు 77,19,14,261 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీరిలో శుక్రవారం 9,40,905 నమూనాలను పరీక్షించారు.
India reports 5,921 fresh #COVID19 cases, 11,651 recoveries, and 289 deaths in the last 24 hours.
Active case: 63,878 (0.15%)
Daily positivity rate: 0.63%
Total recoveries: 4,23,78,721
Death toll: 5,14,878Total vaccination: 1,78,55,66,940 pic.twitter.com/Lp6gJ5AwQ6
— ANI (@ANI) March 5, 2022
Also Read: