
India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నారు. కాగా.. గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా 5,326 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 453 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 79,097 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 8,043 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,41,95,060 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,78,007 మంది ప్రాణాలు కోల్పోయారు.
173కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
కాగా.. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 173 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6 కేసులు రావడంతో.. మొత్తం 28కి చేరాయి కేసులు. ఇక గుజరాత్‌లో ఒకటి కేరళలో నాలుగు ఒమిక్రాన్ కేసులు కొత్తగా వచ్చాయి. దేశంలో కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ 28, తెలంగాణ 21, కర్నాటక 19 కేసులతో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.
India reports 5,326 new #COVID19 cases, 8,043 recoveries, and 453 deaths in the last 24 hours.
Active cases: 79,097
Total recoveries: 3,41,95,060
Death toll: 4,78,007Total Vaccination: 1,38,34,78,181 pic.twitter.com/45bi4eoFqL
— ANI (@ANI) December 21, 2021
Also Read: