India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,624 మంది మృతి.. కేసులు..

|

Apr 24, 2021 | 10:25 AM

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రోజురోజుకూ

India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,624 మంది మృతి.. కేసులు..
Corona-Virus-India
Follow us on

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రోజురోజుకూ వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా గత 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 (1.66 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,89,544 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

నిన్న కరోనా నుంచి 2,19,838 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,38,67,997 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24,28,616 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 83.49 శాతం ఉండగా.. మరణాల రేటు 1.14 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,83,79,832 డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. శుక్రవారం దేశవ్యాప్తంగా 17,53,569 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 23 వరకు మొత్తం 27,61,99,222 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

Also Read:

Telangana corona: తెలంగాణలో ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో 7,432 కేసులు,33 మంది మృతి

ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తితోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు..