India Covid-19: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. 147 రోజుల తర్వాత..

Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ..

India Covid-19: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. 147 రోజుల తర్వాత..
India Corona Updates

Updated on: Aug 10, 2021 | 10:25 AM

Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 147 రోజుల అనంతరం భారీగా కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు 400లకు దిగువన మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా 28,204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 373 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31998158 కి చేరగా.. మరణాల సంఖ్య 428682 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 3,88,508 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 41,511 మంది కోలుకున్నారు. వీటితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 3.11 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 1.21 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగింది. దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 54,91,647 మందికి వ్యాక్సిన్ అందించారు. వీటితో కలిపి ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 51,45,00,268కి చేరింది.

ఇదిలాఉంటే.. కరోనా ప్రారంభం నాటినుంచి ఆగస్టు 9 సోమవారం వరకు దేశంలో మొత్తం 48,32,78,545 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. నిన్న 15,11,313 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also Read:

Girl Death: విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న బీరువా.. పాఠశాలలో బాలిక దుర్మరణం..

Tirupati: చిత్తూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం.. ఇళ్లపైకి వేస్తానంటూ వ్యక్తి హల్‌చల్‌, అరెస్ట్..