India Coronavirus: కేరళలోనే 16 వేల కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Oct 01, 2021 | 9:52 AM

India Covid-19 Updates: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అనంతరం

India Coronavirus: కేరళలోనే 16 వేల కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus
Follow us on

India Covid-19 Updates: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అనంతరం మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా 20వేలకు దిగువన నమోదైన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,727 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 277 మంది మరణించారు. కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా గణాంకాల్లో కేరళలో 15,914 కేసులు నమోదు కాగా.. 122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,66,707 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,339 కి పెరిగింది. అయితే.. నిన్న కరోనా నుంచి 28,246 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,30,43,144 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,75,224 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89,02,08,007 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 15,20,899 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,04,77,338 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్

5 నెలల పసికందుపై మేనమామ హత్యాచారం.. ఉరి శిక్ష వేసిన కోర్టు.. న్యాయమూర్తి ఎమోషనల్