India Coronavirus Updates: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

India Coronavirus Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండేళ్లుగా విజృంభించిన కోవిడ్‌.. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య..

India Coronavirus Updates: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
India Coronavirus Updates

Updated on: Mar 18, 2022 | 10:18 AM

India Coronavirus Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండేళ్లుగా విజృంభించిన కోవిడ్‌.. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గురువారం దేశవ్యాప్తంగా 2,528 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 149 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.40 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 29,181 (0.07%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,58,543కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,281 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక బుధవారం దేశవ్యాప్తంగా 2,539 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1,80,97,94,58 వ్యాక్సిన్‌లను వేశారు.

 

ఇవి కూడా చదవండి:

Omicron – india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!

Coronavirus: చైనాలో పెరుగుతోన్న కరోనా కేసులు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి.. నిపుణుల మాటేంటి.?