India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

Updated on: Mar 19, 2022 | 10:00 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య రెండు వేలకు చేరింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 2,075 కరోనా కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 71 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.56 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 27,802 (0.06%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,06,080 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,352 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,61,926 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.73 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,81,04,96,924 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 3,70,514 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.22 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఔరా అనాల్సిందే..

Prabhas: ‘రాజా డీలక్స్’ ప్రభాస్ సినిమా టైటిల్ కాదట.. మరో హీరో కోసం ఆ టైటిల్ ఫిక్స్ చేశారా..?