India Covid-19: దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. 205 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల్లో భారీగా తగ్గుదల..

India Corona Updates: దేశంలో కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న

India Covid-19: దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. 205 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల్లో భారీగా తగ్గుదల..
India Corona
Follow us

|

Updated on: Oct 10, 2021 | 9:39 AM

India Corona Updates: దేశంలో కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా 20 మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,166 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 214 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. 205 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,30,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 205 రోజుల్లో ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,53,475 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,589 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 23,624 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,71,915 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 94,70,10,175 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 12,83,212 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,25,95,693 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Crime News: ఇల్లు ఇప్పిస్తామంటూ.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత ఫొన్లో రికార్డు చేసి..

కుళ్లిపోయిన శవంతో జాగారం.. కన్నతల్లి బతికొస్తుందని కూతుళ్ల ప్రార్థనలు.. 7 రోజుల తర్వాత..

Crime News: విషాదం.. గుడిసె కూలి కుటుంబం దుర్మరణం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురు చిన్నారులు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?