India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు..

|

Jan 07, 2022 | 11:16 AM

India Covid-19 Updates: జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును, ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు

India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు..
Follow us on

India Covid-19 Updates: జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును, ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు మళ్లీ వన్‌ లాక్‌ మార్క్‌ దాటాయ్. అది కూడా జస్ట్‌ 8 డేస్‌లో. కేవలం ఎనిమిదే రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష దాటాయి. గత 24 గంటల్లో లక్షా 17వేల కొత్త కేసులు రికార్డు అయ్యాయి. 200 డేస్‌ తర్వాత ఇదే హయ్యస్ట్‌ నెంబర్‌. గతేడాది జూన్‌ ఆరున ఫస్ట్‌ టైమ్‌ రోజువారీ కేసులు లక్ష మార్క్‌ను అందుకుంటే, మళ్లీ ఇప్పుడు కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 30,836 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,43,71,845 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. డైలీ పాజిటివిటి రేటు అమాంతం 7.74 శాతానికి పెరిగింది. కాగా.. ఇప్పటివరకు దేశంలో 149.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదిలాఉంటే.. భారత్‌లో ఒమిక్రాన్‌ ఉధృతికి కూడా తెరపడడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 3,007 కు చేరింది. 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఈ వేరియంట్ నుంచి 1999 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

U.S. Covid-19 Updates: అమెరికాలో కరోనా వణుకు.. ఒక్కరోజే 7 లక్షలకు పైగా కొత్త కేసులు