Coronavirus 4th wave in India: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. బుధవారం 7,240 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే (5,233) కేసుల సంఖ్య 2007 పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి (Covid-19) కారణంగా దేశవ్యాప్తంగా 8 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 7 వేల మార్క్ దాటింది. మార్చి నెల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మంగళవారంతో పోలిస్తే.. 40 శాతం కేసులు పెరిగాయి.
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 32,498 కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.71 శాతానికి చేరుకుంది.
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 194.59 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 15,43,748 మందికి టీకాలు ఇచ్చారు.
India records 7,240 new COVID19 cases in the last 24 hours; Active cases rise to 32,498 pic.twitter.com/mnXkuoRsCY
— ANI (@ANI) June 9, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..