NASA: మనదేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత.. అటవీ సంపద అగ్నికి ఆహుతి .. ప్రధాన నగరాల్లో ప్రమాదకరంగా వాయు నాణ్యత

|

Feb 23, 2023 | 9:03 PM

 వందలాది ఎకరాల్లో అటవీ సంపద తగలబడిపోవడం.. సాధారణంగా ఇటు వంటి ఘటనలు అమెరికాలోనే.. లేదా మరో ఇతర దేశాల్లోనే జరుగుతుంటాయని మాత్రమే మనం వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. మన దేశంలోనూ ఇటువంటి ఘటనలు సంభవించినప్పటికీ విదేశాల్లో ఉన్నంత ప్రభావం మన దేశంపై పెద్దగా ఉండదు.

NASA: మనదేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత.. అటవీ సంపద అగ్నికి ఆహుతి .. ప్రధాన నగరాల్లో ప్రమాదకరంగా వాయు నాణ్యత
Forest Fires In India
Follow us on

అడవులు తగలబడుతున్నాయి.. ఈ కార్చిచ్చు ఏ అమెరికాలోనో.. ఆస్ట్రేలియాలోనో కాదు.. మన దేశంలోనే.. అటవీ సంపద అగ్నికి ఆహుతున్న ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. నాసా చెప్పిన మాటల్లో చెప్పాలంటే కేవలం ఏడంటే.. ఏడే రోజుల్లో మన దేశంలో ఏకంగా 11 వందలకుపైగా ప్రాంతాల్లో అడవులు తగలబడ్డాయి. వందలాది ఎకరాల్లో అటవీ సంపద తగలబడిపోవడం.. సాధారణంగా ఇటు వంటి ఘటనలు అమెరికాలోనే.. లేదా మరో ఇతర దేశాల్లోనే జరుగుతుంటాయని మాత్రమే మనం వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. మన దేశంలోనూ ఇటువంటి ఘటనలు సంభవించినప్పటికీ విదేశాల్లో ఉన్నంత ప్రభావం మన దేశంపై పెద్దగా ఉండదు.

కానీ ఇప్పుడు అలా కాదు.. మొన్న అనంతపురం.. నిన్న మహబూబాబాద్.. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. దక్షిణ భారతం, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం ఏడంటే ఏడే రోజుల్లో 1156 కార్చిచ్చు ఘటనలు సంభవించాయంటూ నాసా ఓ రిపోర్ట్ విడుదల చేసింది. మొత్తంగా 12 రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందని.. ఫలితంగా గాలిలో నాణ్యత గణనీయంగా పడిపోతోందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

నాసా ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విజబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియో మీటర్ సూట్ విడుదల చేసిన ఫోటోల్లో దేశంలో ఎక్కడెక్కడ అడవులు తగులబడుతున్నాయన్న వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందులో ఎక్కువగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిషా సహా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలు హైలెైట్ అయి ఉన్నాయి. ఒడిషాలో కేవలం జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు సుమారు 10 రోజుల్లోనే 578 ఘటనలు సంభవించాయి. అడవుల్లో అగ్గి రాజుకోవడానికి మానవ తప్పిదాలతో పాటు ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు, మోతాదుకు మించి డ్రైనెస్ పెరిగిపోవడం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..