India Railway Train Rules: చాలా మంది ప్రయాణికులు కొన్నిసార్లు టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్‌లో ట్రైన్‌ను సమయానికి అందుకోలేకపోతారు. మరో స్టేషన్‌లో ఆ ట్రైన్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరి అలా తరువాతి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కవచ్చా? ఎన్ని స్టేషన్ల తరువాత ట్రైన్ ఎక్కేందుకు ఆస్కారం ఉంటుంది? లేదంటే మీ సీటును మరొకరికి కేటాయించే ఆస్కారం ఉంటుందా? ఆ అధికారం టీటీఈకి ఉంటుందా? బోర్డింగ్ స్టేషన్‌కు సంబంధించి రైల్వే నియమ, నిబంధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా IRCTC నిబంధనలను మార్చింది. ప్రయాణికులు ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేసి, పేర్కొన్న స్టేషన్ నుండి కాకుండా వేరే స్టేషన్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే, అలా చేయవచ్చు. దీనికి సంబంధించి బోర్డింగ్ స్టేషన్‌ను ఆన్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఐఆర్‌సిటిసి. అయితే, రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సదుపాయాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు నిర్దేశించిన స్టేషన్ నుండి రైలును అందుకోలేరని భావిస్తే, మరొక స్టేషన్‌ను బోర్డింగ్ స్టేషన్‌గా మార్చుకోవచ్చు. కానీ, చాలామంది ప్రయాణికులు.. వారు టికెట్ తీసుకున్న స్టేషన్‌కి తరువాత వచ్చే ఏ రెండు స్టేషన్లలో అయినా ఎక్కవచ్చు అని భావిస్తారు. కానీ, బోర్డింగ్ స్టేషన్ ముందు రెండు స్టేషన్లు దాటితే.. ఆ టికెట్‌ను వేరొకరికి కేటాయించే అధికారం ఉంటుంది. అయితే, ఇందుకు సంబంధించిన కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయి. ఒకవేళ మొత్తానికే ట్రైన్‌ను అందుకోలేరని భావిస్తే.. టీడీఆర్‌ని ఫైల్ చేయొచ్చు. తద్వారా టికెట్‌ను రద్దు చేసుకుని బేస్ ఫేర్‌లో 50 శాతం వరకు రిటర్న్ పొందవచ్చు. అయితే, అది కూడా 3 గంటల్లోగా టికెన్‌ను రద్దు చేసుకుంటేనే వర్తిస్తుందనే విషయాన్ని గమనించాలి.
Also read:
Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!