సీజ్‌ఫైర్‌ తర్వాత సరిహద్దుల్లో ఏం జరిగింది..? పాక్‌ ఏం చేసింది.. భారత సైన్యం ఎలా స్పందించింది?

అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, పాకిస్థాన్ త్వరగానే కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. భారత్, పాకిస్థాన్ సైనిక అధికారులు త్వరలో చర్చలు జరుపుతారు. భవిష్యత్తులో ఉద్రిక్తతలు ఎలా ఉంటాయో చూడాలి.

సీజ్‌ఫైర్‌ తర్వాత సరిహద్దుల్లో ఏం జరిగింది..? పాక్‌ ఏం చేసింది.. భారత సైన్యం ఎలా స్పందించింది?
Ceasefire

Updated on: May 11, 2025 | 10:37 AM

తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని తర్వాత.. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే.. అలా ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడి, కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. వీళ్ల డీఎన్‌ఏలోనే మాట తప్పడం ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా పాక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణకు తెగబడ్డ పాకిస్థాన్‌కు భారత బలగాలు అంతే ధీటుగా బదులిచ్చాయి. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో వ్యూహాత్మక నిశ్శబ్ధం కనిపిస్తోంది. శ్రీనగర్‌, ఉధంపూర్‌లో జనం బిక్కు బిక్కుమంటూ బయటకు వస్తున్నారు.

అటు పంజాబ్‌లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని పంజాబ్‌ సర్కారు కోరింది. మరో వైపు యుద్ధ విరమణ ప్రకటన తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులు వివరించేందుకు ఉదయం పదకొండు గంటలకు సైనికాధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరో వైపు రేపు రెండు దేశాల డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ మిలట్రీ ఆపరేషన్స్‌ సమావేశం కానున్నారు. సోమవారం జరిగే సమావేశంలో ఏం చర్చిస్తారు, భారత్‌ పాక్‌కు ఎలాంటి నిబంధనలు విధిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ భారత ప్రభుత్వ డిమాండ్లకు పాకిస్థాన్‌ ఒప్పుకోకుంటే.. భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..