Corona Third Wave: సెప్టెంబర్ నాటికి పీక్ స్టేజ్‌లో థర్డ్‌ వేవ్.. ఎస్‌బీఐ షాకింగ్ రిపోర్ట్.. వివరాలు

|

Jul 05, 2021 | 3:43 PM

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న ప్రజల్లో గుబులు మాత్రం ఇంకా పోలేదు. దానికి కారణం లేకపోలేదు. సెప్టెంబర్-అక్టోబర్..

Corona Third Wave: సెప్టెంబర్ నాటికి పీక్ స్టేజ్‌లో థర్డ్‌ వేవ్.. ఎస్‌బీఐ షాకింగ్ రిపోర్ట్.. వివరాలు
Corona Third Wave
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న ప్రజల్లో గుబులు మాత్రం ఇంకా పోలేదు. దానికి కారణం లేకపోలేదు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెప్పడం ఇప్పుడు అందరికి ఆందోళన కలిగిస్తోంది. అటు కేంద్రం థర్డ్ వేవ్‌ను ఎదుర్కునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా వేగం పెంచింది. ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత లేకుండా ఉండేందుకు ఉత్పత్తిని పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో తాజాగా థర్డ్ వేవ్‌పై ఎస్‌బీఐ రూపొందించిన రిపోర్ట్‌లో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా ఉండనుందని.. అయితే మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉండొచ్చని ఎస్‌బీఐ ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం, దాని లక్షణాలు, ఎన్ని రోజులు ఉండొచ్చన్న అంశాలపై ఎస్‌బీఐ ‘ఎకోరాప్’ పేరుతో ఓ నివేదికను సమగ్ర సమాచారంతో రూపొందించింది.

ఆగస్టు రెండో వారం నుంచి ధర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని అంచనా వేసిన ఎస్‌బీఐ.. దానికోసం కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్దంగా ఉండాలని తెలిపింది. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి వెళుతుందని రిపోర్టులో తేలింది. ఇక ఈ రిపోర్ట్‌ను ఎస్‌బీఐ పరిశోధన విభాగం తయారు చేసింది.

మే 7వ తేదీన సెకండ్ వేవ్ పీక్ స్టేజికి చేరిందని.. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే.. జూలై 2వ వారానికి భారత్‌లో రోజూవారీ కేసుల సంఖ్య 10 వేల లోపు ఉండొచ్చని తెలిపింది. అయితే ఆగష్టు రెండోవారం మరోసారి పాజిటివ్ కేసులు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుందని రిపోర్ట్ అంచనా వేస్తోంది.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ టీకా తీసుకోవడానికి కొందరు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని వారితో వాళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి వల్ల ఇతరులకూ ముప్పు ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిన శరీరాలే కొత్త వేరియంట్లు ఉద్భవించడానికి కారణమనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీకాలు తీసుకోనివారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వైరస్‌ వ్యాప్తి రెట్టింపు స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!