Average Monthly Salary: ఉద్యోగులు, కార్మికుల సగటు నెలజీతంతో వెనకబడి ఉన్న భారత్

ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్‌ చాలా దేశాల కంటే వెనుకబడి ఉన్నట్లు ‘ది వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ సంస్థ వెల్లడించింది. భారత్‌లో సగటు నెల జీతం రూ.46,861గా ఉందని తెలిపింది.

Average Monthly Salary: ఉద్యోగులు, కార్మికుల సగటు నెలజీతంతో వెనకబడి ఉన్న భారత్
Money

Updated on: May 02, 2023 | 6:44 PM

ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్‌ చాలా దేశాల కంటే వెనుకబడి ఉన్నట్లు ‘ది వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ సంస్థ వెల్లడించింది. భారత్‌లో సగటు నెల జీతం రూ.46,861గా ఉందని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న సగటు నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సోమవారం విడుదల చేసింది. అయితే ఈ డాటా ప్రకారం.. మన కరెన్సీలో లక్ష రూపాయాల కంటే అధిక సగటు నెల వేతనం 23 దేశాల్లో ఉంది. ఈ లిస్టులో రూ.50 వేల కంటే తక్కువ సగటు వేతనంతో భారత్‌ 65వ స్థానంలో ఉండటం గమనార్హం. రూ.4,98,567 సగటు వేతనంలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్‌, సింగపూర్‌, అమెరికా దేశాలు ఉన్నాయి. చైనాలో సగటు నెల వేతనం రూ.87,426గా ఉంది. భారత్‌ కంటే వెనుకబడిన జాబితాలో బ్రెజిల్‌, అర్జెంటీనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ లాంటి దేశాలున్నాయి.

అయితే భవిష్యత్తు ఉద్యోగాల విషయంపై వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం.. ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్టు-2023’ పేరుతో తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని, తద్వారా ప్రస్తుతం మొత్తం ఉపాధిలో 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, కంపెనీలు కృత్రిమ మేధ వంటి సాంకేతికతను వినియోగించుకోవడమే ఇందుకు కారణమవుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 903 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను బయటపెట్టింది. రోజురోజుకు పెరుగుతున్న కొత్త సాంకేతికత, డిజిటలైజేషన్‌ కారణంగా బ్యాంక్‌ టెల్లర్స్‌, క్యాషియర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి ఉద్యోగాల్లో మెజార్టీ కోత పడే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి