పుల్వామా దాడిపై పాకిస్తాన్ ‘ఎగవేత’ ధోరణి, భారత్ ఆగ్రహం

పుల్వామా దాడిలో తమ బాధ్యత లేదని పాకిస్థాన్ తప్పించుకుంటోందని భారత్ ఆరోపించింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ లోనే ఉంటున్నాడని..

పుల్వామా దాడిపై పాకిస్తాన్ ఎగవేత ధోరణి, భారత్ ఆగ్రహం

Edited By:

Updated on: Aug 27, 2020 | 8:24 PM

పుల్వామా దాడిలో తమ బాధ్యత లేదని పాకిస్థాన్ తప్పించుకుంటోందని భారత్ ఆరోపించింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ లోనే ఉంటున్నాడని, అయినా అతనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోవడంలేదని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. పుల్వామా ఎటాక్ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు చేసిందని, సుదీర్ఘమైన ఛార్జ్ షీట్ రూపొందించిందని ఆయన చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యులమని మసూద్ అజహర్ ప్రకటించాడని, అయినా అతడిని ప్రాసిక్యూట్ చేయకుండా పాక్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆ దేశ ప్రభుత్వం వెంటనే ఇలాంటి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.