షాకింగ్‌ వ్యాఖ్యలు.. మరో రెండు సంవత్సరాలు అప్రమత్తంగానే ఉండాలి.. కరోనాపై ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌

|

Apr 25, 2021 | 10:22 PM

Indian Institute of Management Ahmedabad: దేశంలో సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొవడంలో భారత్‌ పూర్తిగా విఫలమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌ (ఐఐఎం-ఏ)లో...

షాకింగ్‌ వ్యాఖ్యలు.. మరో రెండు సంవత్సరాలు అప్రమత్తంగానే ఉండాలి.. కరోనాపై ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌
Iim Ahmedabad
Follow us on

Indian Institute of Management Ahmedabad: దేశంలో సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొవడంలో భారత్‌ పూర్తిగా విఫలమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌ (ఐఐఎం-ఏ)లో ప్రముఖ ఆచార్యుడు చిన్మయ్‌ తుంబే అన్నారు. దీనికి ఆయన రెండు కారణాలను చెప్పారు. ఒకటి ప్రభుత్వంతో పాటు ప్రజలు మహమ్మారిని తేలిగ్గా తీసుకున్నారని అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని నెలల్లో వైరస్‌ పూర్తిగా నశించిపోతుందని అంతా భావించారని, ఇక కరోనా రకాలపై పెద్దగా దృష్టి సారించకపోవడం రెండో కారణమన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్న తొలినాళ్లలో విస్తరించిన దానితో పోలిస్తే చాలా భిన్నంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని సడలింపులు ఇవ్వడం భారత్‌ చేసిన తప్పదమని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదిగా పునరుద్దరించారని పేర్కొన్నారు. అలాగే కోవిడ్‌ వ్యాప్తి వెనుక ఉన్న శాస్త్రీయతను కూడా పూర్తిగా విస్మరించారన్నారు. కుంభమేళా నిర్వహణే అందుకు నిదర్శనమన్నారు. కరోనా నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుమతించాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్లతో సిద్ధంగా ఉండాల్సిందన్నారు. డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య మహ్మారి వ్యాప్తిపై నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందన్నారు.

కొన్ని వారాల్లో అంతరించిపోయే మహమ్మారి కాదు..

ఈ మహమ్మారి కొన్ని వారాల్లో అంతరించిపోయేది కాదని, దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో రెండేళ్ల పాటు అప్రమత్తంగా ఉండాలని, అప్పటి వరకు కరోనా అప్పుడప్పుడు పలు విడతల్లో విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు. అయితే తాజా కరోనా మహమ్మారిని అణచివేయడమే తక్షణ కర్తవ్యమన్నారు.

ఇవీ చదవండి:

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ