India Corona: భారత్‌తో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. రికవరీ శాతం ఎక్కువ.. తాజాగా ఎన్ని కేసులంటే..!

|

May 31, 2021 | 10:43 AM

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి కాస్త వెనక్కి తగ్గింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత నాలుగైదు..

India Corona: భారత్‌తో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. రికవరీ శాతం ఎక్కువ.. తాజాగా ఎన్ని కేసులంటే..!
India Corona Updates
Follow us on

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి కాస్త వెనక్కి తగ్గింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత నాలుగైదు రోజులుగా రెండు లక్షల దిగువగానే కేసులు నమోదు అవుతున్నారు. అంతేకాదు రికవరీ రేటు కూడా భారీగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,88,135 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,52,734 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాదాపు రెండు నెలల తర్వాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా నిన్న ఒక్క రోజు 3,128 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు భారత్‌లో 2.8 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, 3,29,100 మంది కరోనాకు బలయ్యారు. ఇక క్రియాశీల రేటు 7.58 శాతానికి తగ్గగా, రికవరీ 91.25 శాతం పెరిగింది. ప్రస్తుతం 20,26,092 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 2,38,022 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.56 కోట్లకు పైగా ఉన్నాయి. మరో వైపు నిన్న ఒక్క రోజు దేశ వ్యాప్తంగా 10,18,076 మందికి కోవిడ్‌ టీకాలు వేయగా, ఇప్పటి వరకు మొత్తం 21,31,54,129 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. పరిమితులు ఉన్నప్పటికీ మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలున్నాయి. ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. ఇక‌పై ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్