దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,74,773 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,19,551 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,17,20,112 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉంటే నిన్న 354 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది. అటు మంగళవారం 39,486 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది.
మరో వైపు.. కరోనా వైరస్ 3వ వేవ్ వస్తుందనే సంకేతాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక ముఖ్యమైన సమావేశాన్ని పిలిచారు. ఈ సమావేశంలో, కరోనా నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబడతాయి. అలాగే, ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి : Salary Slipలో ఏముంటుంది.. HRA, TA , PF వీటిని ఎలా చూసుకోవాలి.. జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి..