India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!

|

Jun 23, 2021 | 9:51 AM

దేశంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 పాజిటివ్ కేసులు, 1,358 మరణాలు సంభవించాయి...

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!
India Corona Updates
Follow us on

దేశంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 పాజిటివ్ కేసులు, 1,358 మరణాలు సంభవించాయి. మంగళవారంతో పోలిస్తే రోజూవారి నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 19 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709కి చేరింది. ఇందులో 6,43,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 68,817 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,89,94,855కి చేరింది. అటు నిన్న 1,358 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,90,660 చేరుకుంది. మరోవైపు మంగళవారం దేశవ్యాప్తంగా 19,01,056 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటిదాకా 29,46,39,511 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి.

తెలంగాణలో కొత్తగా1,175 కరోనా కేసులు…

తెలంగాణలో కొత్తగా 1,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య6,15,574కి చేరింది. ఇందులో16,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1771 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..ఇప్పటి వరకు మొత్తం 5,95,348 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 10 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3,586కి చేరింది.

ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,169 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్‌ బారినపడ్డారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 53 మంది బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,416కి చేరింది. కొత్తగా 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 17,91,056కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!