దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 53,256 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1422 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 88 రోజుల్లో రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడటం ఇదే తొలిసారి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. ఇందులో 7,02,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 78,190 మంది కోలుకోగా.. రికవరీ అయినవారి సంఖ్య 2,88,44,199కి చేరుకుంది. అటు కరోనా కారణంగా ఇప్పటివరకు 3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 28,00,36,898 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ శాతం 96.36 శాతంగా, డెత్ రేట్ 1.30 శాతంగా ఉందని తెలిపింది.
మరోవైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను షూరూ చేశాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణ పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయగా.. ఏపీలో సడలింపుల సమయాన్ని పెంచింది జగన్ సర్కార్. తూర్పుగోదావరి మినహయించి మిగతా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపుల సమయాన్ని పెంచింది. తూర్పుగోదావరిలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇవ్వగా.. ఆ తర్వాత కఠిన లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ నిబంధనలు జూన్ 30 వరకు వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read:
వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..
ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!