దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 7.6 లక్షలు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 88,997 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2.86 కోట్లకు చేరింది. అటు నిన్న 1,647 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,85,137కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 27.23 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతంగా ఉందని తెలిపింది.
#IndiaFightsCOVID19 with great enthusiasm!
? Active cases decline to 7.6 lakh , lowest in 74 days
? Recovery Rate increases to 96.16%
?More than 27.23 cr vaccine doses administered so far across the country@PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/O64m6Jvnln
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 19, 2021
Also Read:
కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?
పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!