సుదీర్ఘంగా భారత్ – చైనాల మధ్య పదో విడత చర్చలు.. మరిన్ని బలగాల ఉపసంహరణకు భారత్- చైనా అంగీకారం
భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి పదో విడత చర్చలు ముగియశాయి. సుమారు 16 గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. 14కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ పీజీకే మీనన్, సౌత్ ...
భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి పదో విడత చర్చలు ముగియశాయి. సుమారు 16 గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. 14కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ పీజీకే మీనన్, సౌత్ జిన్‌జియాంగ్ మిలిటరీ చీఫ్ మేనేజర్ జనరల్ లియు లిన్ మధ్య జరిగిన చర్చల్లో డెస్సాంగ్, ప్యాట్రోలింగ్ పాయింట్ 15, గోగ్రా, డెమ్‌చోక్ ప్రాంతాలపై చర్చించారు. ఈ ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పుడు వీటిపై రెండు దేశాల ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణకు అంగీకరించినా.. డెప్సాంగ్, డెమ్‌చోక్‌లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. నిజానికి డెప్సాంగ్ ప్రాంతంపై చైనా చర్చలకు రావడం ఇదే మొదటిసారి. కాగా, భారత్-చైనా సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు వద్ద తొమ్మిది నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక్కడ వివాదానికి తెరదించుతూ చైనా రక్షణ శాఖ కొన్నాళ్ల క్రితం కీలక ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించినట్లు దానిలో పేర్కొంది. ఆ తర్వాత దానిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంట్‌లో ధృవీకరించారు. మాస్కోలో జరిగిన ఇరుదేశాల విదేశంగమంత్రులు సమావేశం, ఇటీవల జరిగిన తొమ్మిదో విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు.