Crime News: మొబైల్ కోసం ఘర్షణ.. అన్నను ముక్కలుగా నరికి తోటలోనే పాతిపెట్టిన తమ్ముడు.. ఎక్కడ జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Aug 11, 2021 | 7:11 AM

Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. మొబైల్ ఇవ్వనందుకు ఓ యువకుడు తన అన్ననే హత మార్చాడు. అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా

Crime News: మొబైల్ కోసం ఘర్షణ.. అన్నను ముక్కలుగా నరికి తోటలోనే పాతిపెట్టిన తమ్ముడు.. ఎక్కడ జరిగిందంటే..
Knife
Follow us on

Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. మొబైల్ ఇవ్వనందుకు ఓ యువకుడు తన అన్ననే హత మార్చాడు. అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టాడు. 22 తరువాత ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుండటంతో.. విషయం బహిర్గతం అయ్యింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలోని సహరాన్‌పూర్, థానా గంగోహ్ పరిధిలోని ఫతేపూర్ ధోలా గ్రామంలో ఇద్దరు సోదరులు ఫర్మాన్(30), రెహమాన్(16) ఉన్నారు. అయితే, జులై 18వ తేదీన ఈద్‌ కి మూడు రోజుల ముందు ఫర్మాన్ తన కోసం కొత్త ఫోన్ కొన్నాడు. ఫర్మాన్ ఇంటికి వచ్చిన తర్వాత అతని తమ్ముడు రెహమాన్ కూడా తనకు ఫోన్ కావాలని డిమాండ్ చేశాడు. ఫోన్ ఇవ్వడానికి ఫర్మాన్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం నేపథ్యంలోనే రెహమాన్ తన అన్న ఫర్మాన్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫర్మాన్.. స్పాట్‌లోనే మృతి చెందాడు.

తన అన్నయ్య మరణంతో రెహమాన్ తీవ్రంగా భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఫార్మన్ మృతదేహాన్ని శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆపై ఇంట్లోనే గొయ్యి తవ్వి ఖననం చేశాడు. ఆ తరువాత రెహమాన్ కొంతకాలం అజ్ఞాతంలో ఉండి గ్రామంలోనే నిర్భయంగా తిరిగాడు. ఫర్మాన్ గురించి గ్రామస్తులు అడగ్గా.. పనికి వెళ్లాడని చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా ఇంటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తుండటంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇంటికి చేరుకుని తలుపు తెరిచి చూడగా.. తీవ్రమైన దుర్వాసన వచ్చింది. పోలీసులు తమదైన స్టైల్‌లో రెహమాన్‌ను విచారించగా.. అసలు విషయం వెల్లడించాడు. తన సోదరుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. రెహమాన్ సూచనల మేరకు పోలీసులు తవ్వకాలు జరిపారు. ఫర్మాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రెహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, రెహమాన్, ఫర్మాన్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. వీరికి ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉండగా.. వారికి అప్పటికే వివాహం జరిగింది. దాంతో సోదరులిద్దరూ కలిసి ఉంటున్నారు.

Also read:

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..