Crime News: మద్యం మనిషిని మృగంలా మారుస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. బంధం, బలగం, వివేకం, ఆలోచనే లేకుండా చేస్తుంది. తాజాగా మద్యం కోసం ఓ దుర్మార్గుడు కనిపెంచిన కన్నతల్లినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జాషిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హటపాడియా సాహి గ్రామానికి చెందిన సరోజ్ నాయక్(22) మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగిచ్చి తల్లితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజు కూడా ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు. ఇంకా మద్యం తాగాలని భావించి.. తల్లి వద్దకు వచ్చి డబ్బులు అడిగాడు. మద్యం కొనుగోలుకు రూ. 100 ఇవ్వాలంటూ తల్లి షాలందిని కోరాడు. డబ్బులు లేకపోవడంతో ఆమె నిరాకరించింది. దాంతో ఆగ్రహానికి గురైన సరోజ్.. పక్కనే ఉన్న కర్రతో తలపై మోదాడు. దాంతో తీవ్రంగా గాయపడిన షాలంది రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన సరోజ్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also read:
Viral Video: విమానాశ్రయంలో చిన్నారితో సరదాగా పోలీస్ ఆఫీసర్.. వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!
Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!