Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఊహించని రీతిలో దొంగతనం జరిగింది. దుండుగులు ఓ వ్యక్తికి కారులో లిఫ్ట్ ఇచ్చి లక్ష రూపాయలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని రోడ్డు మధ్యలో దించేసి పారిపోయారు. ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. బాధితులు అన్వేష్ కుమార్.. సెక్టార్ బీటా2 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నేను లక్నో వెళ్లడానికి బస్సు కోసం ఉదయం 8:30 గంటలకు పారి చౌక్ వద్ద నిలుచున్నాను. వెంటనే, ఒక కారు నా వద్దకు చేరుకుంది. డ్రైవర్ నాకు లిఫ్ట్ ఇచ్చాడు. అప్పటికే కారు లోపల మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొంతదూరం వెళ్లాక కారులోని వ్యక్తులు.. తాము అధికారులమంటూ నిషేధిత వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నావా? అంటూ నా బ్యాగ్‌ను తీసుకుని తనిఖీ చేశారు. నన్ను బెదిరించి రూ. 4,500 నగదు, రెండు డెబిట్ కార్డులను తీసుకున్నారు. డెబిట్ కార్డుల పిన్ నెంబర్ కూడా తీసుకున్నారు. అలా పిన్ నెంబర్ చెప్పిన తరువాత నన్ను రోడ్డు మధ్యలోనే దించేసి వారు వెళ్లిపోయారు’’ అని బాధితుడు అన్వేష్ కుమార్ వివరించాడు.
కాగా, బాధిత వ్యక్తిని దించేసిన నిందితులు.. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ రెండు డెబిట్ కార్డులను వినియోగించి రూ. 96 వేలు విత్‌డ్రా చేశారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 392(దోపిడీ) కింద కేసులు చేసినట్లు ఎస్‌హెచ్ఓ తెలిపారు. నిందితుల కోసం పోలీసుల బృందం గాలిస్తుందని తెలిపారు.
Also read:
Bumper Offer: బైక్‌లు, స్కూటర్లపై రూ. 28,000 తగ్గింపు.. కొత్త రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )