కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 29 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్‌స్టిట్యూట్ కలిసి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలతో పాటు స్పుత్నిక్ అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి పలు దేశాలు ఆపర్లను ప్రకటించాయి. విదేశాల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీర్లు ఫ్రీ అంటూ కొన్ని సంస్థలు ప్రకటించాయి. మరికొన్ని చోట్లు డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్స్ వంటివి కూడా నడిచాయి. తాజాగా- ఈ లిస్ట్‌లో ఇండియా నుంచి మొదటిసారిగా ఓ విమానయాన సంస్థ చేరింది.
కరోనా టీకా తీసుకున్న ప్రయాణికుల కోసం దేశీయ విమానయాన సంస్థ ఇండిగో క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ట్రావెట్ టికెట్‌లో డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఛార్జీలో 10 శాతం మేర రాయితీ ఇస్తోంది. ఈ మేరకు ‘వ్యాక్సిఫేర్’ పేరుతో కొత్త ఆఫర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 18ఏళ్ల పైబడి వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నవారు సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్‌లో రికార్డయిన తమ వ్యాక్సిన్ స్టేటస్‌ను బోర్డింగ్ గేట్ దగ్గర చూపించి ప్రయాణ రాయితీని పొందవచ్చని సంస్థ తెలిపింది. టికెట్ బుక్ చేసుకున్న సమయానికి భారత్‌లో ఉండి రెండు డోసులు లేదా కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు ఈ డిస్కౌంట్ పొందొచ్చు. దేశంలో కోవిడ్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోందని, ఈ క్రమంలో ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ కుమార్ వివరించారు.
Got vaccinated? Grab this exclusive offer! Know more https://t.co/w6MLsY5oCZ #LetsIndiGo #Aviation #GetVaccinated #Vaccinated pic.twitter.com/P0LbiHKK4t
— IndiGo (@IndiGo6E) June 23, 2021
ALso Read: ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా