ఐటీ, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలతో సహా 2025లో హైరింగ్ కార్యకలాపాలు దేశంలో 9 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉందని గురువారం ఒక నివేదిక తెలిపింది. జాబ్స్, టాలెంట్ ప్లాట్‌ఫారమ్ ఫౌండిట్ (గతంలో మాన్‌స్టర్ APAC & ME) నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం చూస్తే, 2025లో దేశంలో IT, రిటైల్, టెలికమ్యూనికేషన్స్ BFSI రంగాల్లో 9 శాతం నియామకాల వృద్ధి జరిగినట్లు తెలుస్తుంది.
2024లో 10 శాతం వృద్ధితో నవంబర్‌లో 3 శాతం సీక్వెన్షియల్ వృద్ధితో, నియామకాలు జోరుగా పెరిగాయని నివేదక చెబుతుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వ్యాపార ప్రాధాన్యతలు వంటివి 2025లో భారతదేశ జాబ్ మార్కెట్‌ను పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటం అప్లికేషన్లు, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌మెంట్స్ వంటి ఆవిష్కరణలు తయారీ, హెల్త్‌కేర్, ఐటి వంటి పరిశ్రమలు ఫ్యూచర్లో బలంగా రాణించనున్నట్లు తెలుస్తుంది.
జనవరి 2023 నుండి నవంబర్ 2024 వరకు ఫౌండ్‌ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. రిటైల్ మీడియా నెట్‌వర్క్‌లు, AI-ఆధారిత వర్క్‌ఫోర్స్ అనలిటిక్స్ పెరుగుదల, ఈ-కామర్స్, హెచ్‌ఆర్ వంటి వాటిలో జాబ్‌లు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. డిజిటల్ సేవలు, డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అనలిటిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యొోగులకు కోసం సంస్థలు వెతుకుతున్నాయి.
“మేము 2025లో ప్రవేశించినప్పుడు, భారతదేశ జాబ్ మార్కెట్ జోరుగా రాణిస్తుంది. నియామకంలో 9 శాతం వృద్ధిని అంచనా వేస్తుంది. కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం వెతుకుతున్నాయి” అని మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనుపమ భీమ్‌రాజ్ పేర్కొన్నారు. కాలానుగుణ అసమానతలు ఉన్నప్పటికీ 2023తో పోల్చితే 2024లో సెక్టార్‌లు, నగరాల్లో భారతదేశ జాబ్ మార్కెట్ పటిష్టమైన వృద్ధిని కనబరిచిందని నివేదిక తెలుపుతుంది. తయారీ (30 శాతం), కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (29 శాతం), రియల్ ఎస్టేట్ (21 శాతం) వంటి కీలక పరిశ్రమలు ఊపందుకున్నాయని, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటల్ అడాప్షన్, పట్టణీకరణ మద్దతుతో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. కోయంబత్తూర్ (27 శాతం), జైపూర్ (22 శాతం) వంటి నగరాలు ప్రాంతీయ వృద్ధి పెరిగిందని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి