Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఈనెల 18వ తేదీన తీరం దాటనునున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ఫలితంగా బుధవారం నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత వారం రోజులుగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే.. తాజాగా ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. 7 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నాలుగు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ సూచించింది. 17, 18, 19 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబర్ ఐలాండ్స్, కోస్టల్, తమిళనాడు, కర్ణాటక, నార్త్ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
అల్పపీడన తీరం దాటే సమయంలో.. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఐఎండీ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.
Also Read: