Gold Mine Collapse: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం.. కుప్పకూలిన గోల్డ్‌మైన్.. వైరల్ అవుతున్న వీడియో..
నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం తీవ్ర గాయాలపయ్యారు..చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం తీవ్ర గాయాలపయ్యారు..చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.నైజీరియా సరిహద్దుల్లోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్ మైన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని డాన్ ఇస్సా జిల్లా మేయర్ ధృవీరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గ్యారిన్-లిమాన్ గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల్లో ఇంకా మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చునని చెప్పారు.
కాగా, ఈ గ్యారిన్-లిమాన్ గనులను కొన్ని నెలల క్రితమే కొనుగొన్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే, అక్కడి నేల అస్థిరత కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, మైనింగ్‌లో పాత పద్ధతులు పాటించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ సెక్టార్‌ను ఆధునీకరించే ప్రయత్నాల్లో బాగంగా అక్కడి ప్రభుత్వం 2017లోనే అనేక ఆర్టిసావల్ గోల్డ్‌మైన్‌లను మూసివేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..