Sabarimala: అయ్యప్ప భక్తులు బయటపెట్టిన వీడియోలో సంచలన నిజాలు..

| Edited By: Narender Vaitla

Dec 04, 2024 | 6:39 PM

పరమపవిత్రతకు పెట్టింది పేరైన శబరిమలలో అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా అయ్యప్ప భక్తులు బయటపెట్టిన వీడియోలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శబరిమలలో నిషేధిత వస్తువులు లభించడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది..

Sabarimala: అయ్యప్ప భక్తులు బయటపెట్టిన వీడియోలో సంచలన నిజాలు..
Sabarimala
Follow us on

శబరిమల వెళ్లే భక్తులు ఎంతో నిష్టగా మండలం పాటు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని శబరిమల యాత్ర కోసం వెళ్తుంటారు. దీక్ష చేపట్టినన్ని రోజులు భక్తులు మద్యపానం మాంసం సిగరెట్ గుట్కా లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నియమాలు చెబుతున్న మాట. భక్తులు కూడా ఇదే నియమాలను ఆచరిస్తూ దీక్ష చేపట్టిన భక్తులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటుంటారు. ఇలా దీక్ష చేపట్టిన భక్తుల్లో కొద్దిమంది ఆ తర్వాత కూడా శాశ్వతంగా అలవాట్లు నుంచి బయటపడేందుకు ఈ దీక్ష ఉపయోగపడుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇంత నిష్టగా ఉంటూ వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శబరిమల వెళ్లే భక్తులకు అక్కడ నిషేధిత వస్తువులన్నీ అందుబాటులో ఉండడం వివాదాస్పదంగా మారింది. ట్రావెన్కోర్ బోర్డ్ శబరిమల సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాలను పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ చాలా ఏళ్ల నుంచి నిబంధనలను అమలు చేస్తోంది.

ఈ మూడు ప్రాంతాల్లో విచ్చలవిడిగా సిగరెట్లు, గుట్కాలు, కొన్ని సందర్భాల్లో మద్యం బాటిల్ కూడా విక్రయిస్తున్న విషయంపై ఆలయ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు చేస్తున్న ఫలితం ఉండడం లేదు. ఎంత దూరం నష్టతో మాల ధరించి ఇక్కడికి వచ్చిన భక్తుల్లో చాలామంది ఇలాంటి విక్రయాల వల్ల నియమాల నుంచి దారి తప్పుతున్నారని భక్తులు గత ఏడాది ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో తాజాగా శబరిమల వెళ్లిన అదే భక్తులకు ఇక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేని విషయాన్ని గుర్తించి పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్న వీడియోలు తీసి దేవస్థానం అధికారులకు స్థానిక మీడియాకు అందించడంతో విషయం వైరల్ గా మారింది.. దీంతో ప్రభుత్వం ట్రావెన్కోర్ యాజమాన్యంపై ఒత్తిడి పెంచడంతో అలర్ట్ అయింది.

 

కేరళ ఎక్సైజ్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు చేపట్టిన డ్రైవ్ లో శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పంబ ప్రాంతంలో ఏకంగా 80 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 40 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఎక్సైజ్ అధికారుల విచారణలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు విషయంలో కొందరు అధికారుల సహకారం ఉండటం వల్లే జరుగుతున్నట్లు సమాచారం. భక్తులు వీడియోలు తీసి స్థానిక మీడియా లో వైరల్ చేయడం వల్లే విషయం బయటపడింది. లేదంటే అధికారులు అండదండతో ప్రయాలు అలాగే కొనసాగేవని భక్తులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..