‘టమాటా తినడం మానేస్తే ధరలు దిగివస్తాయి’ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

|

Jul 24, 2023 | 10:53 AM

టమాటా ధరల తగ్గింపుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయంటూ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాలంటే..

టమాటా తినడం మానేస్తే ధరలు దిగివస్తాయి మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Minister Pratibha Shukla
Follow us on

లక్నో, జులై 24: టమాటా ధరల తగ్గింపుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయంటూ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాలంటే ఇలా చేయాలన్నారు. ధరలు అధికంగా ఉండే వస్తువులను కొనడం మానేస్తే సహజంగానే ధరలు తగ్గుతాయి. అలాగే టమాటాలను కూడా ఎవరూ కొనుగోలు చేయకపోతే వ్యర్ధాలను నివారించడానికి ధరలు దిగివస్తాయన్నారు.

అంతేకాకుండా ప్రతీ ఏట ఈ సీజన్‌లో టమాటా కొరత ఏర్పడుతుంటుందని, ఇంటి పెరట్లో, చిన్న కుండీల్లో టమాటా మొక్కలను పెంచుకోమని సలహా ఇచ్చారు. ఇళ్లలో కూరగాయలు పండించుకోవడం వల్ల వాటిని కొనవల్సిన అవసరం ఉండదన్నారు. టమాటాలకు ప్రత్యామ్నాయంగా నిమ్మకాయలు కూడా వినియోగించవచ్చని మంత్రి ప్రతిభా శుక్లా సూచించారు.

కాగా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. టమాటా అధిక ధరల ప్రభావం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై పడింది. నేడు ఒక కేజీ టమాట ధరకు కొన్ని నెలల క్రితం ఎన్నో కిలోల టమాటాలు కొనుగోలు చేసేవారు. అధిక ధరల దృష్ట్యా టమాట వినియోగం తగ్గిందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.