కేరళలో గవర్నర్ వర్సెస్ లెఫ్ట్ సర్కార్ వ్యవహారం మరింత ముదిరింది. యూనివర్సిటీల ఛాన్స్‌లర్‌గా మిమ్మల్ని తొలగిస్తున్నాం.. సంతకం పెట్టండి అంటూ రాష్ట్రప్రభుత్వం రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్ ఫైల్‌ను పంపించింది. అయితే గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌పై తొందరగా సంతకం చేసే అవకాశాలు కన్పించడం లేదు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌తో పాటు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్డినెన్స్‌పై తాను నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ (Arif Mohammed Khan) స్పష్టంచేశారు. ఈ ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రపతి అని.. అందుకే రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తునట్టు తెలిపారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. అయితే యూనివర్సిటీల్లో సీపీఎం (CPM) కార్యకర్తల బంధువులకు ఉద్యోగాలు ఇస్తున్నారని, దానిని తాను అడ్డుకుంటునట్టు గవర్నర్ ఎదురుదాడికి దిగుతున్నారు.
కొద్ది రోజుల క్రితం 11 యూనివర్సిటీలో వీసీలను రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలిచ్చారు. దీన్ని రాష్ట్ర సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ కు అలా ఆదేశాలిచ్చే అధికారాలు లేవని ముఖ్యమంత్రి పినరయి విజయన్.. గవర్నర్ ఆరిఫ్ తీరును తప్పు పట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ ను పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ లేఖ రాయడం మరింత వివాదానికి దారితీసింది. గవర్నర్ రాజ్ భవన్ వేదికగా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారని అధికారిక సిపిఎం గవర్నర్ చర్యలను తప్పుపట్టింది.
అయితే, గవర్నర్‌ను యూనివర్సిటీల ఛాన్స్‌లర్‌గా తొలగించే అధికారం చట్టసభలకు ఉందని కేరళ న్యాయశాఖమంత్రి రాజీవ్ స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. ఆర్డినెన్స్‌పై చర్చించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంతో ఈ వ్యవహారంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..