‘ఓం’పై రచ్చ.. రాహుల్‌కు రాజ్‌నాధ్ సూటి ప్రశ్న!

|

Oct 18, 2019 | 6:38 PM

రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ అని రాయకపోతే ఇంకేమని రాయాలని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై కాంగ్రెస్ నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు. విజయదశమి నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. తాను ఆ రోజు రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ రాసినందుకు తీవ్ర విమర్శలు చేశారు. మరి తన స్థానంలో రాహుల్ గాంధీ […]

ఓంపై రచ్చ.. రాహుల్‌కు రాజ్‌నాధ్ సూటి ప్రశ్న!
Follow us on

రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ అని రాయకపోతే ఇంకేమని రాయాలని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై కాంగ్రెస్ నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు. విజయదశమి నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. తాను ఆ రోజు రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ రాసినందుకు తీవ్ర విమర్శలు చేశారు. మరి తన స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే.. శస్త్రపూజ నాడు ‘ఓం’ కాకుండా ఇంకేం రాస్తారో చెప్పాలని రాజ్‌నాధ్ సింగ్ అడిగారు.

మంత్రి ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో రఫెల్ విమానానికి పూలు, కొబ్బరికాయ, నిమ్మకాయలతో ఆయుధపూజ చేసి దానిపై ‘ఓం’ అని రాశారు. ఇక ఈ చర్యను తమాషా, మూఢ నమ్మకం అంటూ ప్రతిపక్షాలు పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సభకు హాజరైన ఆయన.. తనపై వచ్చిన విమర్శలన్నీ ఘాటైన వ్యాఖ్యలతో తిప్పికొట్టారు.