IAF Aircraft Crash: కూలి భూమిలోకి కూరుకుపోయిన మిరాజ్‌ 2000 యుద్ద విమానం.. పైలెట్‌ సాహసానికి మెచ్చుకుని తీరాల్సిందే..

ఆ ఎయిర్‌ఫోర్స్‌ యుద్ద విమానం పైలెట్‌ సాహసానికి మెచ్చుకోవాలి.. మిరాజ్‌ -2000 విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపాన్ని ముందే అతడు గుర్తించాడు

IAF Aircraft Crash: కూలి భూమిలోకి కూరుకుపోయిన మిరాజ్‌ 2000 యుద్ద విమానం.. పైలెట్‌ సాహసానికి మెచ్చుకుని తీరాల్సిందే..

Updated on: Oct 21, 2021 | 2:19 PM

IAF Mirage 2000 aircraft: ఆ ఎయిర్‌ఫోర్స్‌ యుద్ద విమానం పైలెట్‌ సాహసానికి మెచ్చుకోవాలి.. మిరాజ్‌ -2000 విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపాన్ని ముందే అతడు గుర్తించాడు, విమానం క్రాష్‌ అవుతున్న సమయంలో యుద్ద విమానం నుంచి పారాచూట్‌ సాయంతో కిందకు దూకేశాడు . మధ్యప్రదేశ్‌ లోని భీండ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పైలెట్‌ పారాచూట్‌ సాయంతో కిందకు దూకిన దృశ్యాలను కొందరు గ్రామస్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ అభిలాష్‌ పారాచూట్‌ సాయంతో కిందకు దూకాడు. పొలంలో అతడు పడిపోవడంతో గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం లేదు. చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మిరాజ్‌ 2000 యుద్ద విమానం మాత్రం కుప్పకూలిన తరువాత భూమిలో కుంగిపోయింది. విమానం తోక మాత్రమే బయటకు కన్పించింది.

కుప్పకూలిన విమానం నుంచి మంటలు చెలరేగాయి. అయినప్పటికి ఈ ప్రమాదం నుంచి పైలెట్‌ అభిలాష్‌ బయటపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించింది భారత వైమానిక దళం.

Read also: Sajjala: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సజ్జల రామకృష్ణారెడ్డి