‘త్వరలో ముంబైని పేల్చేస్తా..!’ ట్విటర్‌ మెసేజ్‌ పంపిన వ్యక్తి అరెస్ట్

|

May 23, 2023 | 11:35 AM

ముంబాయి పోలీసులకు సోమవారం (మే 22) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. 'త్వరలో ముంబాయిని పేల్చేస్తా' అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విటర్‌ ద్వారా ఈ సందేశాన్ని పంపాడు. వెంటనే అప్రమత్తమైన ముంబాయి పోలీసులు ఈ విషయాన్ని..

త్వరలో ముంబైని పేల్చేస్తా..! ట్విటర్‌ మెసేజ్‌ పంపిన వ్యక్తి అరెస్ట్
Threatening Message To Mumbai
Follow us on

ముంబాయి పోలీసులకు సోమవారం (మే 22) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. ‘త్వరలో ముంబాయిని పేల్చేస్తా’ అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విటర్‌ ద్వారా ఈ సందేశాన్ని పంపాడు. వెంటనే అప్రమత్తమైన ముంబాయి పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించారు. సంబంధిత ట్విటర్‌ ఖాతాపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. విచారణ నిమిత్తం అతడిని జైలుకు తరలించారు.

‘సోమవారం ట్విటర్‌ ద్వారా మెసేజ్‌ పంపిన వ్యక్తిని అరెస్ట్‌ చేశాం. నేను త్వరలో ముంబాయిని పేల్చేస్తాను అని ట్విట్‌ చేశాడు. ఈ మెసేజ్‌ ఇంగ్లిష్‌లో టైప్‌ చేసి ఉంది. విచారణ కొనసాగుతోంది’ ఓ పోలీసధికారి మీడియాకు తెలిపారు.

కాగా మహారాష్ట్ర రాజధాని అయిన ముంబాయికి తరచూ ఇలా బెదిరింపు ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు, ఈ మెయిల్‌ వస్తుంటాయి. ఈ క్రమంలో సోమవారం కూడా ట్విటర్‌ ద్వారా వచ్చిన బెదిరింపు మేసేజ్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.