Hyderabad: బెంగళూరులో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. రెండేళ్ల పాటు సహజీవనం చేసి..

|

Jun 06, 2023 | 4:22 PM

Live-in Relationships Crime News: హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష బెంగళూరులో హత్యకు గురైంది. ఆమెతో గతంలో సహజీవనం చేసిన అర్పిత్‌ ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలోని జీవన్‌బీమా నగర్‌లో ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.

Hyderabad: బెంగళూరులో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. రెండేళ్ల పాటు సహజీవనం చేసి..
Crime News
Follow us on

Live-in Relationships Crime News: హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష బెంగళూరులో హత్యకు గురైంది. ఆమెతో గతంలో సహజీవనం చేసిన అర్పిత్‌ ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలోని జీవన్‌బీమా నగర్‌లో ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఆకాంక్ష, అర్పిత్‌కు రెండేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కొన్నాళ్లు హైదరాబాద్‌లో సహజీవనం కూడా చేశారని సమాచారం. ఈ క్రమంలో ఆకాంక్షకు వేరే ఉద్యోగం రావడంతో ఆమె బెంగళూరులో షిఫ్ట్‌ అయింది. ఆమెను కలిసేందుకు అర్పిత్‌ బెంగళూరుకు తరచూ వచ్చేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ క్రమంలో అర్పిత్ బెంగళూరులోని జీవన్ భీమా నగర్‌లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆకాంక్ష వద్దకు వచ్చాడు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ కోపంలో ఆకాంక్షను అర్పిత్‌ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ హత్యను ఆత్మహత్యగా చేసేందుకు ప్రయత్నించి విఫలమైన అర్పిత్‌ ఘటనాస్థలి నుంచి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన అర్పిత్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అర్పిత్ ప్రయత్నించాడు. అందుకు విఫలయత్నం కావడంతో మృతదేహాన్ని నేలపై వదిలేసి ఇంటి తలుపులు వేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, ఆకాంక్ష రూమ్‌మేట్‌ అపార్ట్‌మెంట్‌కు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ (ఈస్ట్) ఎం చంద్రశేఖర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ కు చెందిన ఆకాంక్ష, ఢిల్లీకి చెందిన అర్పిత్‌ కు రెండేళ్ల నుంచి పరిచయం ఉందని.. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై జీవన్ భీమా నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..