ఆ ఆరు జిల్లాలకోసం ప్రత్యేక సెక్రటేరియట్ .. ఎక్కడో తెలుసా?

ఆ ఆరు జిల్లాలకోసం  ప్రత్యేక సెక్రటేరియట్ .. ఎక్కడో తెలుసా?

కర్ణాటక రాష్ట్రంలో తెలుగు తెలుగు మాట్లాడే వారు  అధికంగా ఉండే హైదరాబాద్- కర్ణాటక రీజియన్ పేరు మారింది. ముఖ్యమంత్రి యడియూరప్ప కలబురిగిలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాల్టి నుంచి (మంగళవారం) హైదరాబాద్- కర్ణాటక రీజియన్ .. కళ్యాణ కర్ణాటక రీజియన్‌గా మార్చినట్టు ఆయన తెలిపారు. గతంలో నిజాం ప్రభువు పాలనలో ఉన్నకాలంలో గుల్బర్గా, బీదర్, రాయచూరు, యదగిర్, బళ్లారి, కొప్పళ వంటి ఆరు జిల్లాలను హైదరాబాద్- కర్ణాటకగా పిలువబడ్డాయి. అయితే నిజాం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 17, 2019 | 1:50 PM

కర్ణాటక రాష్ట్రంలో తెలుగు తెలుగు మాట్లాడే వారు  అధికంగా ఉండే హైదరాబాద్- కర్ణాటక రీజియన్ పేరు మారింది. ముఖ్యమంత్రి యడియూరప్ప కలబురిగిలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాల్టి నుంచి (మంగళవారం) హైదరాబాద్- కర్ణాటక రీజియన్ .. కళ్యాణ కర్ణాటక రీజియన్‌గా మార్చినట్టు ఆయన తెలిపారు. గతంలో నిజాం ప్రభువు పాలనలో ఉన్నకాలంలో గుల్బర్గా, బీదర్, రాయచూరు, యదగిర్, బళ్లారి, కొప్పళ వంటి ఆరు జిల్లాలను హైదరాబాద్- కర్ణాటకగా పిలువబడ్డాయి. అయితే నిజాం కాలం గడిచిపోయినా అప్పటినుంచి ఆపేరు అలాగే ఉండిపోయింది. దీంతో కన్నడ ప్రజలు ఈ పేరు మార్చాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా ఈవిధమై చారిత్రత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ జిల్లాలన్నీ కళ్యాణ కర్ణాటక రీజియన్ పేరుతో పిలువబడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ జిల్లాల అభివృద్ధి కోసం కొత్త సెక్రెటేరియట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం యడియూరప్ప ప్రకటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu