ఛత్రపతి శంభాజీనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన ఈ అగ్నిప్రమాదంలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. దుకాణం పై అంతస్తులో కుటుంబం నివసించేది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా తెలిసింది. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరగటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. చావానీ దానా బజార్ గల్లీలోని మహావీర్ జైన్ టెంపుల్ పక్కనే ఈ క్లాత్ షాప్ ఉండేది. ఈ మూడంతస్తుల భవనంలో ఒక వస్త్ర దుకాణం ఉండగా, ఒక కుటుంబం పై అంతస్తులో నివసించేది.
#WATCH | Maharashtra: A massive fire broke out in a clothing shop in the cantonment area of Chhatrapati Sambhajinagar, Aurangabad. Further details awaited. pic.twitter.com/Uokb80upnP
ఇవి కూడా చదవండి— ANI (@ANI) April 3, 2024
కాగా, మూడంతస్తుల భవనంలోని బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం పై అంతస్తులో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన సమాచారం స్థానికంగా తీవ్ర దావనంలా వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.. అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, అప్పటికి ఏడుగురు దురదృష్టవశాత్తు మరణించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. కాగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో మృతదేహాలను బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఘాటి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం అర్థం కాలేదని చెప్పారు. కాగా, ఈ భవనంలో మొత్తం 16 మంది ఉన్నట్టుగా సమాచారం.
#WATCH | Maharashtra: Manoj Lohiya Commissioner of Police, Aurangabad says, "At around 4 am, a fire broke out in a clothing shop in the cantonment area of Chhatrapati Sambhajinagar. The fire did not reach the second floor but after a preliminary investigation, we think seven… https://t.co/yvCkdT5QYa pic.twitter.com/LeVIrlDDWE
— ANI (@ANI) April 3, 2024
ఈ ఘటన గురించి అందిన మరింత సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో మూడు అంతస్తుల భవనంలో మొత్తం 16 మంది ఉన్నారు. మొదటి అంతస్తులో ఏడుగురు నివసిస్తున్నారు. రెండవ అంతస్తులోనూ మరో ఏడుగురు, మూడవ అంతస్తులో మరో ఇద్దరు ఉంటున్నారని తెలిసింది. ఈ షాపులో మంటలు చెలరేగడంతో రెండో అంతస్థులో ఉన్న ఏడుగురూ చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అవిశ్రాంత శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు రెస్క్యూ సిబ్బంది. అయితే అప్పటికే దుకాణాలన్నీ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ క్లాత్ షాప్ పేరు కింగ్ స్టైల్ టైలర్స్.