India Corona: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. ఆంక్షలు వద్దంటే నిబంధనలు పాటించాల్సిందే

|

Jun 03, 2022 | 11:47 AM

దేశంలో కరోనా కేసుల(Corona Cases in India) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేల వరకే నమోదైన కేసులు తాజాగా నాలుగు వేలు దాటాయి. వివిధ రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, కరోనా నిబంధనలు...

India Corona: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. ఆంక్షలు వద్దంటే నిబంధనలు పాటించాల్సిందే
Corona
Follow us on

దేశంలో కరోనా కేసుల(Corona Cases in India) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేల వరకే నమోదైన కేసులు తాజాగా నాలుగు వేలు దాటాయి. వివిధ రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, కరోనా నిబంధనలు పాటించకపోవడం వంటివి కరోనా వ్యా్ప్తికి కారణమవుతున్నాయి. కొత్త కేసుల ప్రభావం కోలుకనే వారి సంఖ్యపై ప్రభావం చూపిస్తోంది. కోలుకుంటున్న వారి కంటే, వైరస్ కు గురయ్యే వారి సంఖ్యే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ(Kerala), మహారాష్ట్రలో(Maharashtra) కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. కొత్త కేసులతో దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 21 వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4.25 లక్షల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,041 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. 84 రోజుల తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం ఆందోళనకర విషయం. అంతే కాకుండా పాజిటివిటీ రేటు కూడా పెరిగి, ఒక శాతానికి చేరింది.

కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోరారు. మరోసారి ఆంక్షల్లోకి వెళ్లకూడదంటే స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. నిన్న 19 వేలకు పైగా ఉన్న బాధితుల సంఖ్య ఇవాళ 21,177 కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 2,363 మంది కోలుకోగా.. వైరస్ కారణంగా 10 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి