AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMSYM Scheme: ఈ పథకంలో చేరండి.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందండి.. పూర్తి వివరాలు మీకోసం..

PMSYM Scheme: అసంఘటిత కార్మికులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన

PMSYM Scheme: ఈ పథకంలో చేరండి.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందండి.. పూర్తి వివరాలు మీకోసం..
Money
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2021 | 12:00 AM

Share

PMSYM Scheme: అసంఘటిత కార్మికులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో చేరిన కార్మికులకు 60 ఏళ్ల వయస్సు దాటాక.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్‌లో చేరేందుకు ఇంకా అవకాశం ఉంది. కార్మికులకు మేలు చేకూర్చే ఈ స్కీమ్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకానికి అర్హతలేంటి..? అసంఘ‌టిత రంగాల్లో పనిచేస్తూ నెల‌కు రూ. 15 వేల కంటే.. తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులు ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన స్కీమ్‌కు అర్హులు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగినవారు ఈ స్కీమ్‌లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఈ పథకంలో ఎలా చేరాలి..? అర్హత కలిగిన చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్‌(సీఎస్‌సీ)లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా, జన్‌ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ ఉండాలి. దేశ వ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్‌సీ సెంటర్లు ఉండగా.. వీటిలో ఎక్కడైనా ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.

ఈ స్కీమ్‌ ఎలా ఉంటుంది.. ఈ స్కీమ్‌లో చేరిన చందాదారుడు 50 శాతం ప్రీమియం చెల్లిస్తే.. అంతేస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఒకవేళ ఈ పథకంలో చేరిన చందారుడు చనిపోతే.. అతని నామినీ(భార్య/భర్త) ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. చందాదారుడికి 60 ఏళ్లు దాటాక నెలకు రూ. 3 వేలు చొప్పున పెన్షన్ లభిస్తుంది. అయితే, మొదటి నెల చెల్లింపు జరిపిన తరువాత వారికి రశీదు ఇస్తారు. దాంతోపాటు.. ప్రత్యేక ఐడీ నంబర్లు ఉన్న కార్డులను కూడా అందిస్తారు.

మధ్యలోనే ఉపసంహరించుకుంటే.. ఈ స్కీమ్‌లో చేరిన చందాదారుడు పదేళ్ల కంటే ముందుగానే నిష్క్రమిస్తే.. అప్పటి వరకు జమ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి చెల్లిస్తారు. పదేళ్ల తరువాత అంటే 60 ఏళ్ల వయసు రాకముందే ఈ స్కీమ్ నుంచి తప్పుకున్నట్లయితే.. వడ్డీ లేదా.. పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. దాంతోపాటు.. లబ్ధిదారుడి వాటా కూడా తిరిగి చెల్లిస్తారు.

Also read:

Cyberabad Police: మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు.. 353 మందికి జైలు శిక్ష..

Gold Coins: బాత్రూమ్ నిర్మాణం కోసం తవ్వుతుంటే.. బంగారం బయటపడింది.. అది గుర్తించిన కూలీలు ఏం చేశారంటే..

Road Accident: మొత్తం ఏడు కార్లు.. ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయ్.. ముంబై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా