Maoist Weapons: మావోయిస్టులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి?

|

Jul 20, 2021 | 4:31 PM

కాలంతో పాటు అప్‌డేట్‌ అవుతున్నారు మావోయిస్టులు. ఆధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు.  నూతన పోరాట పద్దతులపై పట్టు సాధిస్తున్నారు. మరి మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచీ వస్తున్నాయి? సరఫరా ఎలా జరుగుతోంది.

Maoist Weapons: మావోయిస్టులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి?
Maoist Weapons
Follow us on

కాలంతో పాటు అప్‌డేట్‌ అవుతున్నారు మావోయిస్టులు. ఆధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు.  నూతన పోరాట పద్దతులపై పట్టు సాధిస్తున్నారు. మరి మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచీ వస్తున్నాయి? సరఫరా ఎలా జరుగుతోంది. ఇటీవల పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టులకు చెందిన ఆయుధ డంప్‌లు పట్టుబడ్డాయి. పోలీసుల కూంబింగ్‌లో భారీగా దొరుకుతున్న ఆయుధ డంప్‌లను చూసి..పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం, ఐఓబీ ప్రధాన కేంద్రాలుగా ఆయుధాల డంప్‌లు గుర్తించారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌ నుంచీ మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గంజాయి స్మగ్లర్లు, ఆయుధాల స్మగ్లర్ల నుంచి నక్సల్స్‌ కు ఆయుధాలు అందుతున్నట్లు భద్రతా అధికారులు ఆరోపిస్తున్నారు. స్మగ్లర్లు అరెస్టు తర్వాత మావోయిస్టుల భారీ డంప్‌లకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఆయుధ సరఫరాకు మయన్మార్‌-నేపాల్‌-మణిపూర్‌ మార్గమే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిధులు, ఆయుధాల విషయంలో అర్బన్‌ మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఎక్కువగా బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి మావోయిస్టులకు ఆయుధాలు సమకూరుతున్నాయి. ఇదే విషయాన్ని 2009లోనే  నాటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పారు. నేపాల్‌ సరిహద్దు మార్గం ద్వారా అక్రమ ఆయుధ సరఫరా జోరుగా సాగుతోంది. రష్యా, చైనాల నుంచీ ఈ ఆయుధాలను స్మగ్లర్లు సేకరిస్తున్నారు. లక్షలాది గ్రైనేడ్లు, గ్రైనేడ్‌ లాంచర్ల కోసం మావోయిస్టులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కొంతమంది హక్కుల నేతలు దీనికి సహకరిస్తున్నారనే ప్రచారముంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయుధ డీలర్ల, ఉగ్రవాదుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏకే-47 వంటి ఆయుధాల ఇవ్వడం వెనుక ఉగ్రవాదులతో సంబంధం ఉండే స్మగ్లర్లు, డీలర్ల పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గిరిజన కొండ ప్రాంతాల్లో గంజాయి కొనుగోలుకు తమిళనాడు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు వస్తున్నారు. యూపీ, మణిపూర్‌ వంటి రాష్ట్రాల నుంచీ ఆయుధాలు తెచ్చి మావోయిస్టులకు ఇస్తున్నట్లు సమాచారం.

దండకారణ్యం అడవుల్లో మావోయిస్టులు సొంతంగా నాటు తుపాకులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘఢ్ లో 2019లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఆర్మీ ఉపయోగించే హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్‌లను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2018లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్. జర్మనీలో తయారైన రైఫిల్, యూఎస్ సబ్- మెషిన్ గన్ స్వాధీనం చేసుకున్నారు.

చ‌త్తీస్‌గ‌డ్‌, జార్ఖండ్, ఓడిషాల్లో మావోయిస్టులకు కీల‌క స్థావ‌రాలున్నాయి. ప్రతీ ఏటా మావోయిస్టులు దాచిన అనేక ఆయుధ డంప్‌లను పోలీసులు వెలికి తీస్తున్నారు. 2021 ఏప్రిల్‌ 3న ములుగు మండలంలో ఒక పోడు భూమిలో దాచిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భూమిలో స్టీల్‌ బక్కెట్‌లలో పెట్టిన వందలాది తూటాలు, డిటోనేటర్లు వెలికితీశారు. 2020 నవంబర్‌ 5, ఒడిశాలో స్వాభిమాన్‌ అంచల్‌ కటాఫ్‌ ఏరియాలో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తించారు. ఒడిశా మల్కాన్‌గిరి పోలీసులకు 305 రైఫిల్స్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ మ్యాగజైన్స్‌, బుల్లెట్లు, ఐఈడీ బాంబులు దొరికాయి. 2020 అగస్టు 24న ఆంధ్రా- ఒడిశా స‌రిహ‌ద్దులో ఆయుధ డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. క‌లిమెల పోలీస్ స్టేష‌న్, సూధికొండ కురూబ్ అట‌వీ ప్రాంతంలో డంప్‌ గుర్తించారు. ఆయుధాల త‌యారీకి ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండర్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Also Read..

రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు.. BCల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ బాటలు..

‘ఈదుల్ జుహా’కు అంతా సిద్ధం.. బక్రీద్ ప్రాశస్త్యం ఏంటి..? ఖుర్బానీ మూడు వాటలెందుకు వేస్తారు..?