పాకిస్థాన్‌ క్షిపణులను భారత్‌ ఎలా గాల్లోనే నాశనం చేస్తోంది..? మన దగ్గరున్న ఈ పవర్‌ఫుల్‌ సిస్టమ్‌ గురించి తెలుసా?

పాకిస్తాన్ చేసిన క్షిపణి దాడుల ప్రయత్నాలను భారత సైన్యం ఎలా తిప్పికొట్టిందో తెలిస్తే షాక్ అవుతారు. S-400 వ్యవస్థ సామర్థ్యాలు, దాని పనితీరు, 400 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం, 36 లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోగల సామర్థ్యం వల్లే ఇది సాధ్య పడుతోంది.

పాకిస్థాన్‌ క్షిపణులను భారత్‌ ఎలా గాల్లోనే నాశనం చేస్తోంది..? మన దగ్గరున్న ఈ పవర్‌ఫుల్‌ సిస్టమ్‌ గురించి తెలుసా?
S 400 Air Defense System

Updated on: May 08, 2025 | 4:37 PM

ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసిన క్షిపణి దాడి ప్రయత్నాలను భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. అయితే.. పాకిస్థాన్‌ ఏకధాటిగా క్షిపణులు, డ్రోన్లతో మన దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇండియా ఎలా వాటిని తప్పికొడుతోంది. క్షిపణులను, డ్రోన్లను ఎలా గాల్లోనే పేల్చేస్తోంది. అందుకోసం మన దగ్గరున్న వ్యవస్థ ఏంటి? వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పాకిస్థాన్‌ చేసే దాడులను అడ్డుకోవడానికి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు సమాచారం.

పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. S-400 అనేది 400 కిలో మీటర్ల వరకు పరిధి కలిగిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు. దీన్ని ప్రత్యేకంగా స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సహా వివిధ వైమానిక లక్ష్యాలను అడ్డగించడానికి రూపొందించారు. దీనిని రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది.

రష్యా నుండి S-400 డిఫెన్స్ సిస్టమ్, బహుళ బ్యాటరీలను కొనుగోలు చేసింది భారత్‌. వాటిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట మోహరించింది. 2007 నుంచి ఈ S-400 మన రక్షణ కోసం పనిచేస్తోంది. దీనిని 2007 నుండి రష్యన్ సాయుధ దళాలు ఇతర అంతర్జాతీయ ఆపరేటర్లు ఉపయోగిస్తున్నారు. రష్యాలో తయారైన S-400 ట్రయంఫ్ క్షిపణిని ప్రవేశపెట్టడం వలన భారత రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. దీనికి సాటిలేని వేగం, రహస్య క్షిపణి, స్వదేశీ వ్యవస్థలతో నెట్‌వర్క్డ్ ఏకీకరణ ఉన్నాయి.

S-400 సామర్థ్యాలు

  • S-400 రాడార్లు 360 డిగ్రీ యాంగిల్లో నిఘా ఉంచుతాయి
  • ఏకకాలంలో 36 ముప్పులను ఎదుర్కొంటాయి
  • ఇది వివిధ రకాల అధునాతన ఆయుధాలను ఉపయోగించి గుర్తించేందుకు తక్కువ అవకాశం ఉన్న వాటిని కూడా గుర్తించి ట్రాక్ చేయగలదు
  • ఇది 400 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగలదు, నాలుగు రకాల క్షిపణులతో చొరబాటుదారులను నాశనం చేయగలదు
  • సముద్ర మట్టానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు
  • ఇది లేయర్డ్ డిఫెన్స్‌లో భాగంగా నాలుగు వేర్వేరు క్షిపణులను ప్రయోగించగలదు
  • ఇందులో యాంటీ-ఎయిర్ క్షిపణి లాంచర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ క్షిపణులు ఉంటాయి
  • మూడు టెక్నాలజీలతో పనిచేసే వ్యవస్థ కలిగి ఉంటుంది
  • ఈ S-400కు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సుదర్శన చక్రంగా నామకరణం చేసింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..