డెంగ్యూ కి చెక్ పెట్టిన ఢిల్లీ.. ఎలా ? అదే పొలిటికల్ విల్.. పబ్లిక్ సపోర్ట్..

ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ డిసీజ్ బారిన వేల సంఖ్యలో ప్రజలు పడుతున్నారు. ఏడ్స్ ఏజిప్టి అనే జాతికి చెందిన ఆడ దోమల వల్ల ఇది వ్యాపిస్తోంది. ఈ దోమ తాలూకు వైరస్ కారణంగా … డెంగ్యూ తో బాటు చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జింకా ఇన్ఫెక్షన్ వంటివి సైతం సోకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న వేళ.. వర్షాకాల సీజన్ లో చెరువులు, నీటిగుంటలు, కాలువల్లో చేరే ఈ రకం దోమలు ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. డెంగ్యూకు […]

డెంగ్యూ కి చెక్ పెట్టిన ఢిల్లీ.. ఎలా ? అదే పొలిటికల్ విల్.. పబ్లిక్ సపోర్ట్..
Follow us

|

Updated on: Sep 08, 2019 | 11:52 AM

ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ డిసీజ్ బారిన వేల సంఖ్యలో ప్రజలు పడుతున్నారు. ఏడ్స్ ఏజిప్టి అనే జాతికి చెందిన ఆడ దోమల వల్ల ఇది వ్యాపిస్తోంది. ఈ దోమ తాలూకు వైరస్ కారణంగా … డెంగ్యూ తో బాటు చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జింకా ఇన్ఫెక్షన్ వంటివి సైతం సోకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న వేళ.. వర్షాకాల సీజన్ లో చెరువులు, నీటిగుంటలు, కాలువల్లో చేరే ఈ రకం దోమలు ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. డెంగ్యూకు సంబంధించిన మెజారిటీ కేసుల లక్షణాలను ఇప్పటికీ డాక్టర్లు ఖఛ్చితంగా నిర్ధారించలేకపోవడమే విశేషం. అందువల్లే ఈ కేసులను తక్కువగా చూపడం జరుగుతోంది. పైగా పలు కేసులను మిస్ క్లాసిఫై చేయడం విడ్డూరం. అంటే డెంగ్యూ కాకుండా ఇతర వ్యాధులకు సంబంధించిన కేసులుగానో, మామూలు జ్వరంగానో పొరబడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 128 దేశాల్లో మూడు వందల కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి వైరస్ బారిన పడుతున్నారని అంచనా. ఇండియాలో నాలుగు రకాల వైరస్ లు మరీ ప్రబలుతున్నాయి. 2015 లో ఒక్క ఢిల్లీలోనే 15 వేల 867 కేసులు నమోదు కాగా 70 మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు. డెంగ్యూ రోగుల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. రక్తం పలచబడిపోతుంది. అయితే దీనికి విరుధ్ధంగా జరిగి కెపిల్లరీ లీకేజీ కారణంగా రక్తం థిక్ గా మారిన పక్షంలో ఫలితాలు మరోలా ఉంటాయట. తక్కువ స్థాయి ప్లేట్ లెట్స్ కారణంగా రోగికి ప్రధానంగా ద్రవీకృత ఆహారమే ఇవ్వాల్సిఉంటుంది. జ్వరం తగ్గినట్టే తగ్గినా, రోగికి నరాల బలహీనత పెరిగిన పక్షంలో డెంగ్యూ సీరియస్ అవుతుంది. ఇంటర్నల్ వాస్క్యులార్ డీహైడ్రేషన్ కూడా తోడైతే మరీ డేంజరే ! ఢిల్లీలో డెంగ్యూను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు చర్యలుచేపట్టింది. మొదట అధికారులు ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. కాలువలు, చెరువుల్లో దోమల నిర్మూలనకు, అలాగే వీధుల్లో ఫామింగ్ వంటివి విస్తృతంగా చేపడుతున్నారు. సిటీలో ఈ వ్యాధి కేసులపై ‘ ఉక్కుపాదం ‘ మోపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య, పారిశుధ్య శాఖలు, ఆస్పత్రులు, క్లినిక్ లు, స్కూలు పిల్లలతో బాటు ప్రజలు, యువకులు, మహిళా బృందాల సంయుక్త సహకారంతో ఈ వ్యాధి తాలూకు కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. 2015 లో ఈ నగరంలో తొలి ‘ మొహల్లా క్లినిక్ ‘ వెలిసింది. ప్రస్తుతం వీటి సంఖ్య 203 కి పెరిగింది. ఏసీతో కూడిన ఈ క్లినిక్ లలో ప్రయివేటు ఆసుపత్రి వంటి వాతావరణం ఉంటుంది. వీటిలో 109 అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు రోగులకు రకరకాల డయాగ్నస్టిక్ టెస్టులు చేయడానికి సిధ్ధంగా ఉంటారు. నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెంగ్యూ రోగులకు ప్రత్యేకంగా వెయ్యి బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రయివేటు హాస్పిటల్స్ లోనూ పడకల సంఖ్యను 10 నుంచి 20 శాతం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. డెంగ్యూ అదుపునకు వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. అలాగే ప్లేట్ లెట్ కౌంట్ టెస్టుకు 50 రూపాయలు, ఎన్ ఎస్ ఐ ఎలీసా టెస్టుకు 600 రూపాయలు ఫీజుగా వసూలు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ చిత్తశుద్ది, ప్రజల సహకారం ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!