చైనా బోర్డర్ లోనే ఆ దేశం ! మరి.. కరోనా వైరస్ లేదేం ?

చైనాకు దాదాపు 1300 కి.మీ. పొడవునా బోర్డర్ ను కలిగి ఉండి.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను కూడా కొనసాగిస్తున్న చిన్న దేశం వియత్నాం ఇతర దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. కారణం ? కరోనా వైరస్ కేసులను..

చైనా బోర్డర్ లోనే ఆ దేశం ! మరి.. కరోనా వైరస్ లేదేం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 3:40 PM

చైనాకు దాదాపు 1300 కి.మీ. పొడవునా బోర్డర్ ను కలిగి ఉండి.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను కూడా కొనసాగిస్తున్న చిన్న దేశం వియత్నాం ఇతర దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. కారణం ? కరోనా వైరస్ కేసులను కేవలం 332 కి కట్టడి చేయడం ఆ దేశానికే చెల్లింది. అలాగే అక్కడ కరోనా మరణాలు కూడా లేవు. ఇది ఎలా సాధ్యమైంది ? ఇందుకు ఆ దేశ ప్రభుత్వం  తీసుకున్న పటిష్టమైన చర్యలే ! 96 మిలియన్ల జనాభా గల ఈ దేశం రానున్న ముప్పును ముందే ఊహించింది. మొట్ట మొదట చైనా నుంచి వచ్ఛే లేదా.. తమ దేశం నుంచి ఆ దేశానికి వెళ్లే విమాన సర్వీసులనన్నింటినీ రద్దు చేసింది. ఈ చర్య తీసుకున్న ప్రపంచ దేశాల్లో వియత్నామే మొట్టమొదటిది. జనవరి మాసాంతానికే నేషనల్ ఎమర్జెన్సీని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 21 న లాక్ డౌన్ ని ఎత్తివేసింది. పక్కనున్న చైనాలో ఏం జరుగుతున్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూవచ్చింది. 2003 లో సార్స్ వంటి వైరసే చైనాలో తలెత్తిందని గ్రహింఛామని, ఇక అప్పుడే ఇలాంటిదేదో మనకు ప్రమాదకరమేనని భావించామని వియత్నాం లోని ఎపిడర్మాలజీ విభాగం హెడ్ షామ్ క్వాంగ్ థాయ్ తెలిపారు. ఈ వైరస్ ఔట్ బ్రేక్ గురించి.. అక్కడి ల్యాబ్ లు చేస్తున్న పరిశోధనల గురించి. కరోనా రోగులకు అందజేస్తున్న చికిత్సల గురించి తెలుసుకుంటూ వచ్చామని, 23 మంది మంత్రులు, నిపుణులతో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్ఛే ప్రతి వ్యక్తికీ టెస్టులు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు సుమారు మూడు లక్షల టెస్టులు నిర్వహించగా వీటిలో 328 పాజిటివ్ కేసులని  తేలిందన్నారు.

ప్రధానంగా ఎసింప్టోమాటిక్ కేసులపై కూడా దృష్టి పెట్టామన్నారు. వాటిని నిర్లక్ష్యం చేయలేదని, ఎప్పటికప్పుడు టెస్టులను పెంచుతూపోతూ.. కరోనా లక్షణాలు ఉన్నవారిని హాస్పిటల్ కి… ఎలాంటి  లక్షణాలు కనబడకున్నా పాజిటివ్ ఉన్నవారిని తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ కి తరలిస్తూ వచ్చామని థాయ్ వివరించారు. తమ ప్రజలు కూడా ప్రభుత్వం విధించిన నిబంధనలను చిత్తశుద్దితో పాటిస్తూ వచ్చారన్నారు. ఇలాంటి పటిష్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్ కేసులను సమర్థంగా నియంత్రించగలిగామని ఆయన చెప్పారు.